Sunday, March 28, 2010

ఉగాది కవిత - ప్రమోద సంవత్సరం

ఉగాది ఈ ఉగాది
ప్రమోద ఉగాది
కాలమహావృక్షం చిగురించిన
చివురుటాకు ఈ ఉగాది
ఆశలు చిగురింప జేసి
బ్రతుకులు చిగురింపజేయు
నవ్య ఉగాది - ప్రమోద ఉగాది
ప్రమోదమును కలిగించునట్టి
ప్రమోద ఉగాది.

ఓ ప్రమోదమా!
నీలాగే వచ్చిందా శుక్లం
చేసిందెంతో ఆర్భాటం
సాధించింది శూన్యం
మిగిల్చింది రక్తం
నీవలా కాకూడదని మా ఉబలాటం
ఈ వత్సరమంతా సంవత్సరమంతా
ప్రతి ఇంటా ప్రతి కంటా
ప్రమోదమ్ము నిండాలని
ఆశిస్తూ ఆకాంక్షిస్తూ
పలుకుతున్నాము స్వాగతం.

వచ్చేయ్ ! విచ్చేయ్ !
ఆనందంతో ఆహ్లాదంతో
ఆర్భాట రహితంగా
అభ్యుదయ సహితంగా
మనిషి బతుకుల్లో
భారం తొలగిస్తూ
మోదం కలిగిస్తూ
అందుకుని మా స్వాగతం
వచ్చేయ్ ! విచ్చేయ్ !
ఓ ప్రమోదమా! ప్రమోదమ్ముతో.

(మార్చి 27, 1990. చిట్యాల, నల్గొండ జిల్లా.)

Welcome

స్వాగతం సుస్వాగతం
ఈ బ్లాగ్ లో నా పాత కవిత్వం నుండి ఇవాల్టి భావాలు, ఇంకా చాలా విషయాలు మీకు స్వాగతం పలుకుతాయి.